7, డిసెంబర్ 2013, శనివారం

చెట్టు మనపై కక్ష కడుతుందా ? ప్రకృతి మనపై పగ పడుతుందా ?

చెట్టు మనల్ని ఎంతో ప్రేమిస్తుంది... 
మనకు పూలు, పండ్లతో పాటు మనకు ప్రాణ వాయువును అందిస్తుంది. 
మనం... దాని కొమ్మలు విరిచేస్తాం.. . 
ఆకులు తుంచేస్తాం... నరికేస్తాం... కాల్చేస్తాం. 
 చెట్టు మనపై కక్ష కడుతుందా ? మన ప్రాణాలు తీస్తుందా?

 ప్రకృతి మనల్ని ఎంతో ప్రేమిస్తుంది. 
 గాలి, వెలుతురు, నీరు... ఇలా ఎన్నో ఇస్తుంది. 
మనం... దాన్ని ప్రేమించక పోగా ఏ మాత్రం శ్రద్ధ చూపo ...
 కలుషితం చేస్తాం... దుర్వినియోగం చేస్తాం. 
 అలా అని  ప్రకృతి మనపై పగ పడుతుందా ?  మనల్ని చంపేయాలని అనుకుంటుందా? 

మరి మనిషైన మనం మాత్రం ఎందుకు ప్రేమించలేదని,  పెళ్ళికి ఒప్పుకోలేదని, దూరం పెడుతున్నారని... మనం ఎంతగానో ప్రేమించిన  అమ్మాయిపై కక్ష కడుతున్నాం. దాడి చేస్తున్నాం. ప్రాణాలు తీస్తున్నాం?


పంజాబ్లోని లూథియానలో పెళ్లి కూతురుపై  యాసిడ్ దాడి జరిగింది. తన ప్రేమను అంగీకరించ లేదని, తనతో పెళ్ళికి ఒప్పుకోలేదని ఓ యువకుడు చేసిన దుర్మార్గానికి యువతి బలైంది. 

 



 కడప  జిల్లా  చిన్నమండెం మండలానికి చెందిన ఆంజనేయులు తను రెండేళ్లుగా ప్రేమించిన యువతి వేరే వ్యక్తిని ఇష్టపడుతోందని... ఆమె ప్రాణాలు తీసి ... లేఖ రాసి తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. 

 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి