
అందమైన మనసు కావాలా?
మనిషి అందం అశాశ్వతం
మనసు అందం శాశ్వతం
అందమైన మనసును ప్రేమిస్తే కలకాలం ఆనందం
అలాంటి అందమైన మనసులు ఒక్కటైతే...
ఆ జీవితం స్వర్గం.
ఆ స్వర్గంలో ఉన్నారు.... హైదరాబాద్ లో సిద్దూ, కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం పంచాయతీ కార్యదర్శి శేషకుమారి.
శేషకుమారి తిరుపతి విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లో సిద్దూ పరిచయమయ్యారు. భావాలు కలిసి మంచి స్నేహితులయ్యారు. మనసులు కలిసి ప్రేమికులయ్యారు. ప్రేమ పేరుతో చదువులు నిర్లక్ష్యం చేయలేదు. కెరీర్ పాడు చేసుకోలేదు. పెద్దలను ఇబ్బంది పెట్టలేదు. బాగా చదువుకున్నారు. ఉద్యోగాలతో స్థిరపడ్డారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
వారి ప్రేమకు కులాలు అడ్డురాలేదు. శేషకుమారి వైకల్యం అడ్డు నిలవలేదు. ఆమెను అతను అడగడుగునా ప్రోత్సహిస్తాడు. అతనికి ఆమె క్షణక్షణం ఉత్సాహాన్ని ఇస్తారు. ఒకరికి ఒకరుగా హాయిగా జీవితం సాగిస్తున్నారు.
ప్రేమహృదయం వీరిని చూసి గర్వపడుతోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి