2, డిసెంబర్ 2013, సోమవారం

నువ్వే నేను.... నేనే నువ్వు

నువ్వు  తుమ్మేదవైతే నేను పువ్వునై ఉంటా...  

పరిమళం వెదజల్లే పువ్వు నువ్వైతే పూల వనం నేనై ఉంటా...  

కనిపించే మంచు నువ్వైతే ఆ చల్లదనం నేనై ఉంటా ... 

అందమైన ప్రకృతి నువ్వైతే వసంతం నేనై ఉంటా...  


పువ్వుల పరిమళాలు, 

మంచులోని సౌమ్యం,

ప్రకృతిలోని అందం, 

వసంతంలోని కోలాహలం,

అన్ని నువ్వైతే ..............  

నీలోని సగభాగం నేనైనప్పుడు  నువ్వు నేనే కదా మనం  ఒక్కటే కదా  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి