
ఎంత అన్యాయం...?
ఒట్టి పోయిందని గోమాతని కటికింటికి తోయడం
ఎంత పాపం..?
నిన్ను ప్రేమించి... నువ్వే జీవితం అనుకొని...
తన బ్రతుకును నీకు అర్పించిన ప్రియురాలిని వేధించి, హింసించి
ప్రాణాలు తీయడం పై రెండింటికంటే ఘోరం.
కూకట్ పల్లి ప్రాంతానికి చెందినా సునీత, మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం శాఖాపూర్ గ్రామానికి చెందిన సాయికుమార్ ప్రేమించుకున్నారు. మూడు ఏళ్ళు కాపురం చేశారు. వారి ప్రేమకు గుర్తుగా ఒక బాబు పుట్టాడు. ఇంత జరిగాక అదనపు కట్నం కోసం అత్తమామలు వేధించారు. భర్త మౌనం దాల్చాడు. ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించి, జీవితం అర్పించిన సునీత దీనిని భరించలేక పోయింది. అన్నింటిలో అండగా ఉంటాడనుకున్న సాయికుమార్ తప్పుకోవడాన్ని జీర్ణించుకోలేక పోయింది. ప్రస్తుతం ఈ కేసు జడ్చర్ల పోలీసులు విచారిస్తున్నారు.
తనతో పాటు ... తన ప్రేమనూ ఉరితాటికి వేలాడదీసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి