
గుండెలనిండా ప్రేమ నింపుకొని ప్రేమించే వారిచుట్టూ తిరుగుతూ ఉంటారు.
ఆ ప్రేమను ఎలా చెప్పాలో, ఎలా చూపించాలో తెలియక సతమతమౌతుంటారు.
ఇలాంటి వారికి ఓ చక్కటి చిట్కా......
ప్రతి రోజు అందుబాటులో ఉండే గులాబీలతో మీ ప్రేమను చెప్పచ్చు, చూపించచ్చు .
గులాబీల సంఖ్యను బట్టి ప్రేమ భావం మారుతుంది.
1- గులాబీ ఇస్తే తొలి చూపులోనే ప్రేమించా అని అర్థం.
3- గులాబీలు ఇస్తే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అర్థం.
7- గులాబీలు ఇస్తే నేను నీ ప్రేమలో పిచ్చివాన్ని అని అర్థం.
9- గులాబీలు ఇస్తే నువ్వు నా దానివి , నా ప్రేమవు అని అర్థం.
11-గులాబీలు ఇస్తే నీవు నా హృదయ రాణివి, అందాల నిధివి అని అర్థం.
ఇంకెందుకు ఆలస్యం....
గులాబీలను ఎంచుకొని మీ మనసులోని ప్రేమను తెలియజేయడానికి పరుగులు తీయండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి