ప్రేమను వదిలేస్తావా? ప్రాణం వదిలేస్తావా? అంటే ..
ప్రాణం వదిలేయడానికే ప్రేమికులు ఇష్టపడతారు.
ప్రేమ కావాలా? ప్రాణం కావాలా? అంటే ...
ప్రేమే కావాలంటారు ప్రేమికులు.
కడప జిల్లా సిద్ధవటం మండలం కడపాయపల్లె కు చెందిన
శారద ప్రేమనే కోరుకుని అమర ప్రేమికురాలైంది.
శారద సొంత ఊల్లొనే ఒక అబ్బాయిని ప్రేమించింది. పెద్దలు కాదని బలవంతంగా బంధువుల అబ్బాయి చంద్రబాబు నాయుడుతో పెళ్లి చేశారు. శారద అతనితో కాపురం చేయలేదు. ప్రియుడితో వెళ్లి పోయింది. వెతికి మరీ వారిద్దరిని పట్టుకొచ్చారు. ప్రియుడిని బెదిరించారు. శారదను ఇంటికి తీసుకుపోయారు. ఐనా శారద వారి మాట వినలేదు. ప్రాణం పోయినా ప్రేమను వదులుకోలేనంది. తమ పరువు పోతుందని భావించిన భర్త చంద్రబాబు నాయుడు, అన్న శ్రీనివాస నాయుడు కలిసి చంపేశారు. వీరిద్దరూ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిని కాపాడటానికి రాజకీయ నేతలు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
వీరిని కఠినంగా శిక్షించాలని ప్రేమ హృదయం కోరుకుంటోంది.
మరి మీరూ ....
ప్రాణం వదిలేయడానికే ప్రేమికులు ఇష్టపడతారు.
ప్రేమ కావాలా? ప్రాణం కావాలా? అంటే ...
ప్రేమే కావాలంటారు ప్రేమికులు.
కడప జిల్లా సిద్ధవటం మండలం కడపాయపల్లె కు చెందిన
శారద ప్రేమనే కోరుకుని అమర ప్రేమికురాలైంది.

వీరిని కఠినంగా శిక్షించాలని ప్రేమ హృదయం కోరుకుంటోంది.
మరి మీరూ ....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి