
అమైనా కాచిలియా అనే భారత సంతతి మహిళ సౌత్ ఆఫ్రికాలో ఒక సామాజిక కార్యకర్త. 28 ఏళ్ల జైలు జీవితం అనుభవించి వచ్చిన తర్వాత మండేలా ( తొలి బార్యతో విడివడిన తర్వాత) తనను ప్రేమిస్తున్నట్లు చెప్పినట్లు ఆమినా తన ఆటోబయోగ్రఫీ *వెన్ హోప్ అండ్ హిస్టరీ రైమ్* అనే పుస్తకంలో రాశారు.
ఒక రోజు తన ఇంటికి వచ్చిన మండేలా తనను గాడంగా ముద్దాడారని, తనను చాలా అందగత్తవని పొగిడారని రాశారు. ఆయనను సున్నితంగా తిరస్కరించానని తెలిపారు. *నేను వృద్ధురాలిని* అంటే ..గతం గతః ఇప్పుడు కొత్త జీవితం ప్రారంబిద్దామని మండేలా చెప్పినట్లు పేర్కోన్నారు . అప్పుడు మండేలా ప్రేమను తాను తిరస్కరించినట్లు పుస్తకంలో రాశారు . ఆ తరవాత మండేలా ఎంతో స్నేహంగా ఉండేవారిని తెలిపారు.
అలా మండేలా ప్రేమ వన్ సైడ్ లవ్ స్టోరీగా మిగిలి పోయింది.
గాంధీ బాటలో నడిచి నల్ల జాతీయుల స్వాతంత్రం కోసం పోరాటం చేసిన యోధుడు ఈ ప్రపంచాన్ని వదిలివేసి వెళ్ళిపోయారు . ఆయనకు ఘనంగా ప్రేమ హృదయం నివాళి అర్పిస్తోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి