
ప్రేమ అంతే... ఒక స్థాయి వరకే ప్రేమలా ఉంటుంది. ఆ హద్దు దాటితే అది ఆవిరి అవుతుంది.
అదే నీటిని ఒక క్రమ పద్ధతిలో వేడి చేస్తే... 100 డిగ్రీల సెల్సియస్ దాటి ఆవిరిగా మారి పెద్ద రైల్ ఇంజిన్నే నడుపుతుంది.
ప్రేమ అంతే... పెళ్లి అనేది దానికి ఒక క్రమ పద్ధతి... తరవాత హద్దులు దాటితే సంసార నావను నడుపుతుంది.
అలా కాకుండా పెళ్ళికి ముందే ఒక అమ్మాయి ... ప్రియుడిని నమ్మి హద్దులు దాటింది. ప్రియుడు మోసం చేస్తే కోర్టును ఆశ్రయించింది.
ఖమ్మం జిల్లా నేలకొండ పల్లి మండలం చెర్వు మాదారానికి చెందిన ఓ అమ్మాయి అదే గ్రామానికి చెందిన కుక్కల రాజును ప్రేమించింది. పెళ్లి చేసుకుంటానంటే నమ్మి సర్వస్వం అర్పించింది. మోసపోయింది. అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంటే' తట్టుకోలేక పోయింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఖమ్మం న్యాయస్థానం రాజుకు ఐపిసి 376 కింద ఏడేళ్ళ జైలు శిక్ష విధించారు.
అమ్మాయి లు జాగ్రత్త... ఇటువంటి మోసగాళ్ళు ఉంటారు... ప్రేమించినా హద్దులు దాటకుండా ఉండండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి