
జీవితం పడవ...
ప్రేమ తెడ్డు..
తెడ్డుతో పడవ నడుపుతూ సాగరం దాటాలి.
ఇలా దాటేటప్పుడు సమాజమనే సాగరం పోటెత్తుతుంది. తుఫాన్ సృష్టిస్తుంది. పెద్ద పెద్ద అలలను మీదికి పంపుతుంది. భయపడిపోయి పడవను వదిలేస్తే తెడ్డు ఉన్నా ప్రయోజనం ఉండదు.
పెద్దలు మందలించారని, కాదన్నారని, తిరస్కరించారని జీవితాన్నే వదిలేస్తే ... ప్రేమ ఉండీ ఏం లాభం?
అలలను, తుఫాన్లను ప్రేమ తెడ్డుతో దాటి... జీవిత పడవను ఒడ్డుకు చేర్చినప్పుడే ప్రేమకు, జీవితానికి సార్ధకత.
ఇలా దాటలేని ఓ ప్రేమ జంట ఆత్మహత్యా యత్నం చేసింది.
ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్ కు చెందిన సరిలాల్, కల్పన ప్రేమించుకున్నారు. పెద్దలకు విషయం తెలిసి మందలించారు. వారి ప్రేమకు నిరాకరించారు. దీంతో సరిలాల్ పురుగుల మందు తాగాడు. ఈ విషయం తెలిసి కల్పన నిద్ర మాత్రలు మింగింది. వెంటనే పెద్దలు తెలుసుకుని ఇద్దరిని ఆసుపత్రికి తీసుకెల్లడంతో ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు.
ప్రేమికులారా... బతికి సాధించండి.
ప్రేమ ప్రాణం తీసి...
మీ ప్రాణాలను గాలిలో కలిపేయకండి.
|
![]() |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి