
షికార్లు తిరగడానికి ఓకే...
సినిమాలకు వెళ్ళడానికి ఓకే..
పార్కుల్లో జంటగా గడపడానికి ఓకే...
పెళ్లి చేసుకోవడానికి మాత్రం నాట్ ఓకే...
అమ్మాయిల్లారా జాగ్రత్త... ఇటువంటి వాళ్ళతో జాగ్రత్త...
ఇలా జాగ్రత్తగా ఉండకనే నల్గొండ జిల్లా కురంపల్లికి చెందిన అరుణ మోసపోయింది.
దర్వేశిపురానికి చెందిన సైదులును ప్రేమించింది. అన్నీ తనే అనుకుంది. చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగిన సైదులు ఆమెను మోసం చేశాడు. పెళ్లి చేసుకోమని అడిగినందుకు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ప్రేమను వదులుకోలేక, ప్రాణం వదలలేక చావు బతుకుల మధ్య విలవిలలాడుతోంది.
ఇలా నమ్మించి ద్రోహం చేసే ప్రేమ పిశాచాలను ఉరితీయాలని
ప్రేమ హృదయం కోరుకుంటోంది.
ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని అమ్మాయిలను హెచ్చరిస్తోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి