తూరుపున సూర్యుడు వెలిగి పోతున్నాడు...
నా చెలి నుదుట సింధూరమై
పచ్చికపై మంచు బిందువులు మెరిసి పోతున్నాయి...
నా సఖి మందహాసమై
గాలి నాట్యం చేస్తోంది... నా హృదయరాణి కురులై...
ముంగిట ముగ్గు మురిసి పోతోంది... నా ప్రియురాలి మోమై...
పక్షులు కిలకిల రావాలవుతున్నాయి...
నా ప్రేయసి కోసం కొట్టుకునే నా గుండె చప్పుల్లై...
శుభోదయం
బాగుంది
రిప్లయితొలగించండి