
మనువారా ఒక్కటైoది.
ఎన్ని కలలు... ఎన్ని ఆశలు...
ఎన్ని ఆశయాలు..
ప్రియుడితో ఏడడుగులు నడిచి... వందేళ్ళ జీవితం ప్రారంభించింది.
మూడు ముళ్ళ బంధం... రెండు రోజులకే ప్రాణం మీదికి వస్తుందనుకోలేదు.
కలలు కల్లలయ్యాయి. ఆశలు అడిఆశలయ్యాయి. ఆశయాలు మసయ్యాయి.
నూరేళ్ళ జీవితం... 48 గంటల్లో ముగుస్తుందని ఊహించలేదు....
నెల్లూరుకు చెందిన నీలిమ.
నీలిమ నెల్లూరు నగరంలోనే తనకంటే చిన్న వాడిన శ్రీనివాసులును ప్రేమించింది. ఇద్దరు శనివారం పెళ్లి చేసుకున్నారు. పెద్దలు కాదనడంతో శ్రీనివాసులు పిన్ని ఇంటికి వెళ్లారు. చిన్నవాడిని మాయ చేసి, మందు పెట్టి వలలో వేసుకున్నావని అందరూ సూటి పోటి మాటలు అన్నారు. నిందించారు. ఈ అవమానం భరించలేక పోయింది. శ్రీనివాసులు వారి మాటలు విని నీలిమను దూరం పెట్టాడు. తట్టుకోలేక పోయింది. సోమవారం ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. శ్రీనివాసులు పరారయ్యాడు. ఇందూరుపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ విత్తనాలు నాటి... పెళ్లి పంట వేసిన నీలిమ...
ఆ పంట పండకుండానే లోకం విడిచి వెళ్ళిపోయింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి