17, డిసెంబర్ 2013, మంగళవారం

ప్రేమలో ప్రేమే ఉంటుంది... పైసాచికం కాదు

పాలు శ్రేష్టమైనవి. పాలను పాలతో కలిపితే చెడిపోవు.
పాలలో కొద్దిగా వ్యర్థమైనది పడితే మొత్తం పాలు విరిగిపోతాయి. 
ప్రేమా  అంతే  శ్రేష్టమైనది. అందులో కొద్దిగా చెడు ఉన్నా ఫలించదు. 

ప్రేమ కావాలనుకోవడం తప్పు కాదు. ప్రేమ కోసం ప్రేమించిన వ్యక్తినే వేధించడం తప్పు. 
ప్రేమ కోసం ఎంత కష్టపడినా తప్పులేదు.
ప్రేమను కష్టాలపాలు చేయడం తప్పు. 

హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ కి చెందిన ఎరాబోయిన కోటేశ్వర్ రావ్ ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థలో ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. తనకు తెలిసిన అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అంటూ వెంటపడ్డాడు. ఆమె నిరాకరించడంతో ఆమె పేరు మీద ఫేస్ బుక్ లో నకిలీ ఖాతా తెరచి అసభ్య  సందేశాలు పంపి వేధిoచడమే  కాక తనను నిర్లక్ష్యం చేస్తే లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. సైబరాబాద్ పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. 

ప్రేమించాలి, ప్రేమను చూపించాలి, ప్రేమను ప్రేమతోనే పొందాలి. 
ప్రేమలో ప్రేమ మాత్రమే ఉంటుంది. పైసాచికం కాదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి