
నాలుగు కాళ్ళను ఒకే బాట నడిపారు...
రెండు మనసులు ఒక్కటి చేశారు.
రెండు తనువులు ఒక్కటిగా బతికారు.
ఒకే ఊపిరయ్యారు... ఒకే హృదయమయ్యారు.
కలిసే బతకాలనుకున్నారు... కాలిసే చావాలనుకున్నారు.
విధి వారిని విడదీసింది.
ప్రియుడిని ఎవరో హత్య చేశారు. అతను లేని లోకంలో... అతను లేని జీవితంలో... తాను ఉండలేనని ప్రియురాలు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది.
చిత్తూరు జిల్లా గంగవరం మండలం మారేడు పల్లికి చెందిన మాధవి, హొమ్ గార్డుగా పనిచేస్తున్న దేవేందర్ ప్రేమించుకున్నారు. మూడు రోజుల క్రితం దేవేందర్ ను ఎవరో హత్య చేశారు. ఈ బాధను భరించలేని మాధవి ఉరి వేసుకుని ప్రాణాలు విడిచింది. అమర ప్రేమికురాలైంది.
ప్రేమను చంపలేని విధి ప్రేమికులను చంపింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి