
ప్రేమంటే భరోసా ... భయం కాదు
ప్రేమంటే చావైనా, బతుకైనా కలిసి నడిచే మార్గం...
చంపేసే దుర్మార్గం కాదు.
మనసున్న వాడని నమ్మింది.
కళ్ళలో పెట్టుకుని చూసుకుంటానంటే ప్రేమించింది.
పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది.
పెళ్లి ఐన 17 రోజులకే మృత్యువై కబలిస్తాడని
ఊహించలేక పోయింది... అంజలి.
తూ. గో. జిల్లా అమలాపురానికి చెందిన అంజలి హైదరాబాద్ లో ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది.
విశాఖ జిల్లా ఎలమంచిలికి చెందిన జాన్ఆడంసన్ కాటేదాన్లో పనిచేస్తున్నాడు.
ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి డిసెంబరు 11న పెళ్లి చేసుకున్నారు. ఈ రోజు నుంచే అనుమానంతో అంజలిని వేధించడం మొదలు పెట్టాడు. 17రోజులకే జాన్ కపట మనసు బయటపడిoది. ఎందుకు ఇలా మారిపోయావని నిలదీసినందుకు అంజలిని గొంతు నులిమి చంపేశాడు.
జాన్ మీద ఆమె పెంచుకున్న నమ్మకం చనిపోయింది.
అంజలితో పాటు ప్రేమ ప్రాణాలు విడిచింది.
జాన్ లాంటి ప్రేమ ద్రోహిని ఏం చేస్తే పాపం పోతుంది..?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి