చిన్నప్పటి నుంచి మనం అడిగినవి అన్నీ ఇచ్చిన పెద్దలు...
ప్రేమ విషయంలో ఎందుకు వద్దంటున్నారో
ఆలోచించారా ?
అలా ఆలోచిస్తే ...
ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు.
20 ఏళ్ళు పెంచిన మనల్ని కాదని....
పిల్లలు ఎందుకు ప్రేమ పెళ్లి వైపు వెళుతున్నారు?
ఇలా ఆలోచిస్తే ... ప్రేమకు ఎందుకు అడ్డుచెబుతారు.
పిల్లలు, పెద్దలు ఎవరూ ఆలోచించలేదు. పెద్దలు వారి ప్రేమకు ఒప్పుకోలేదు. పిల్లలు వారి మాట వినలేదు.
కర్నూలు జిల్లా ఆదోనికి చెందినా రవికుమార్, లావణ్య ప్రేమించుకున్నారు. పెద్దలు కాదని లావణ్యకు వేరే వ్యక్తి తో వివాహం ఈ నెల 15న నిచ్చఇంచారు. వేరుగా బతకడం నరకమని బావించిన ప్రేమికులు మంత్రాలయంలో ఆత్మహత్యా యత్నం చేశారు.
ప్రేమికులారా .... ముందు పెద్దలను ఒప్పించండి... మీ ప్రేమలో ఎంత నిజాయతీ ఉందో తెలియజేయండి. ఇద్దరు కలసి బతకడానికి ఉన్న దారులను వివరించండి. మీ ఇద్దరి ప్రేమను వద్దనడానికి ఉన్న సమస్యలేంటో కనుక్కోండి. వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిoచండి.
పెద్దల్లారా... పిల్లల ప్రేమను అర్థం చేసుకోండి. మీకున్న అభ్యంతరాలను తెలిపి, వాటిని పూరించే అవకాశం ఇవ్వండి. మూర్ఖంగా వ్యతిరేకించకుండా ఆలోచించండి.
రవికుమార్, లావణ్య బతికారు కాబట్టి సరిపోయింది ... ప్రాణాలు పోయింటే .... అప్పుడు అందరూ ఏడవాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి